హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 15 (విజయక్రాంతి): ఒడిశా నుంచి హైదారాబాద్‌కు రైల్లో గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని మల్కాజిగిరి రైల్వేస్టేషన్‌లో ఎక్సుజ్ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి 17.22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి రవాణా సమాచారం అం దుకున్న ఎస్‌టీఎఫ్ ఏ టీమ్ శుక్రవారం మల్కాజిగిరి రైల్వే స్టేషన్‌లో మాటువేశారు. గంజాయి సంచులతో రైలు దిగిన ఎస్‌కే అహ్మద్ అలీని పట్టుకున్నారు. అతడి నుంచి 17.22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ధూల్‌పేట్‌కు చెందిన రాహుల్ సింగ్ కు అప్పగిం చేందుకు గంజాయి తీసుకొచ్చినట్లు నిందితుడు అంగీకరించాడు.
ఒడిశా కు చెందిన పాండు అలియాస్ పబిత్రనాయక్ రాహుల్‌సింగ్‌కు గంజాయి పంపిస్తాడ ని నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌టిఎఫ్ సీఐ ఎంపీఆర్ చంద్రశేఖర్ తెలిపారు. నిందితుడిని పాటు పట్టుబడ్డ గంజాయిని మల్కాజిగిరి ఎక్సుజ్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు.
మరో కేసులో..
అప్పర్ ధూల్‌పేట్‌లో ఉన్న హజారీ హోటల్ సమీపంలో ఎస్‌టీఎఫ్, ఎక్సుజ్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం నిర్వహించిన రూట్‌వాట్‌లో నలుగురి నుంచి 4.238 కేజీల గంజాయిని పట్టుకున్నారు. గంజాయితో పట్టుబడిన నలుగురిని విచారించగా మరో ఎనిమిది మందికి గంజాయి అమ్మకాలతో సంబంధాలు ఉన్నట్లు వెల్లడించారు.
పట్టుబడినవారిలో గణేశ్, రాహుల్ సింగ్, అంకిత్, లడ్డూ సింగ్ ఉన్నారు. యూసఫ్, చరణ్, శంకర్, అమన్ సింగ్, ఆదర్శ్‌సింగ్, ముఖేశ్ సింగ్, ఎస్‌కే అహ్మద్, సుమరాజ్ గులారీలు పరారీలో ఉన్నారు. రెండు చోట్ల గంజాయిని పట్టుకున్న టీమ్ ఎక్సుజ్ ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి అభినందించారు.