calender_icon.png 5 December, 2024 | 12:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

2.25 కేజీల గంజాయి స్వాధీనం

11-07-2024 12:17:02 AM

నిజామాబాద్‌లో ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ 

నిజామాబాద్, జూలై 10 (విజయక్రాంతి): ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఎన్నిదాడులు నిర్వహిస్తున్నా నిజామాబాద్ జిల్లాలో ఏదో మూల గంజాయి పట్టుబడుతునే ఉంది. తాజాగా నిజామాబాద్ నగరంలో దాడులు నిర్వహించిన ఎక్సైజ్ అధికారులు 2.25 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. చంద్రశేఖర్ కాల నీ నుంచి బైపాస్ రోడ్డుకు వెళ్లే మార్గంలో ఎక్సైజ్ అధికారులు బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని తనిఖీ చేయగా వారివద్ద గంజాయి లభించింది. నిందితు లు మిర్చి కాంపౌండ్‌కు చెందిన బాబాఖాన్, సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం బీబీపేట్‌కు చెందిన కేతావత్ కిషన్‌ను అదుపులోకి తీసుకున్నారు.