calender_icon.png 29 October, 2024 | 2:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

105 కేజీల డ్రగ్స్ స్వాధీనం

28-10-2024 12:00:00 AM

స్మగ్లర్లను అరెస్టు చేసిన పంజాబ్ పోలీసులు

చండీగఢ్, అక్టోబర్ 27: పంజాబ్‌లో భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబ డ్డాయి. సుమారు 105 కిలోల డ్రగ్స్‌ను పోలీసులు ఆదివారం సీజ్ చేశారు. సముద్ర మార్గంలో పెద్ద మొత్తంలో డ్రగ్స్ తరలిస్తున్నట్టు ఇంటెలిజెన్స్‌కు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆపరేషన్ చేసి పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

పాకిస్థాన్ నుంచి జలమార్గంలో 105 కేజీల హెరాయిన్, 31.93 కిలోల కెఫిన్ అన్‌హైడ్రస్, 17 కిలోల డీఎంఆర్‌లతో పాటు తుపాకులను తరలించేందుకు స్మగ్లర్లు ప్రయత్నించారని రాష్ట్ర డీజీపీ గౌరవ్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న నవజ్యోత్ సింగ్, లవ్‌ప్రీత్‌కుమార్‌ను అదుపులోకి తీసుకు న్నామన్నారు. ఈ కేసులో ఎవ్వరినీ వదలబోమని, పట్టబడ్డ డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో వందలకోట్ల వరకు ఉంటుందని చెప్పారు.