హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 3(విజయక్రాంతి): ఆపరేషన్ ధూల్‌పేట్‌లో భాగం గా శనివారం ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన దాడుల్లో 5కిలోల గంజాయిని స్వాధీ నం చేసుకున్నారు. కుమ్మర్వాడీకి చందిన నిఖిల్‌కుమర్, అఖిలేష్‌సింగ్, జియాగూడకు చెందిన అరుణ్‌రావు, అమీష్, ఆశిష్, గణేష్, సాయికుమార్‌ను అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ అంజిరెడ్డి తెలిపారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ సీఐలు మధుబాబు, గోపాల్, ఎమ్మార్పీ చంద్రశేఖర్, భాస్కర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.