28-01-2025 01:20:22 AM
* టాప్ నుంచి బోపన్న జోడీ ఔట్
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ విజేత మాడిసన్ కీస్ టెన్నిస్ ఏటీపీ ర్యాంకింగ్స్‌లో కెరీర్ బెస్ట్ అందుకుంది. ఇటీవలే నంబర్‌వన్ సబలెంకను ఓడించిన కీస్ ఏడో స్థానంలో నిలిచింది. కీస్‌తో పాటు అమెరికాకు చెందిన మరో ముగ్గురు ఆటగాళ్లు టాప్ చోటు దక్కించుకోవడం విశేషం.
కోకో గాఫ్ మూడో ర్యాంకు నిలుపుకోగా.. జెస్సికా పెగులా ఆరో స్థానం, ఎమ్మా నవ్వారో ఒక స్థానం దిగజారి తొమ్మిదో స్థానం దక్కించుకున్నారు. సబలెంక టాప్ ర్యాంకును కాపాడుకోగా.. స్వియాటెక్ (పోలండ్) రెండో స్థానంలోనే కొనసాగుతోంది. పురుషుల సింగిల్స్ విభాగంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత సిన్నర్, రన్నరప్ జ్వెరెవ్, అల్కరాజ్ తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.
జొకోవిచ్ (సెర్బియా) ఆరో స్థానానికి చేరుకున్నాడు. ఇక భారత్ నుంచి డబుల్స్‌లో రోహన్ బోపన్న ద్వయం ఐదు స్థానాలు దిగజారి 21వ స్థానంతో సరిపెట్టుకుంది. సింగిల్స్‌లో సుమిత్ నాగల్ టాప్ నుంచి ఔటయ్యాడు.