calender_icon.png 6 March, 2025 | 1:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మలక్‌పేట శిరీష హత్య కేసులో కీలక మలుపు

05-03-2025 09:55:16 AM

హైదరాబాద్: మలక్ పేటలో వివాహిత శిరీష(Malakpet Sirisha case) హత్య కేసు కీలక మలుపు తిరిగింది. శిరీష భర్త వినయ్ సోదరే హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. శిరీష హత్య గురించి తెలిసి కూడా సోదరికి వినయ్ సోదరికి అండగా నిలిచాడు. భర్త వినయ్ భార్య శిరీష మృతదేహాన్ని మాయం చేయాలనుకున్నాడు. శిరీషకు వినయ్ సోదరి మత్తుమందు ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తెలింది. శిరీష స్పృహ కోల్పోయాక ఊపిరాడకుండా చేసి చంపినట్లు నిర్ధారణ అయింది. 

గుండెపోటులో చనిపోయినట్లు వినయ్ శిరీష మేనమామకు ఫోన్ చేసి చెప్పాడు. శిరీష మృతదేహాన్ని ఆస్పత్రిలోనే ఉంచాలని మేనమామ కోరారు. శిరీష మేనమామ చెప్పినా వినకుండా మృతదేహాన్ని వినయ్ తరలించాడు. శిరీష మేనమామ ఆస్పత్రికి వచ్చేలోపే మృతదేహాన్ని మాయం కావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసుల సహకారంతో శిరీష మేనమామ అంబులెన్స్ ను వెంబడించాడు. శిరీష హత్య కేసులో భర్త వినయ్, అతని సోదరిని పోలీసులు అరెస్ట్ చేశారు.