04-03-2025 01:38:13 PM
మైలార్‌దేవ్‌పల్లి,(విజయక్రాంతి): మైలార్‌దేవ్‌పల్లి మధుబన్ కాలనీ ఏటీఎం చోరీ యత్నం కేసు(ATM Theft Case)లో కీలక మలుపు చోటుచేసుకున్నారు. అంతకుముందే రావిర్యాలలోని ఎస్బీఐ ఏటీఎం చోరీ చేసి రూ.13 లక్షలు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. రావిర్యాల ఎస్బీఐ ఏటీఎం(Raviryala SBI ATM)ను గ్యాస్ కట్టర్ తో ధ్వంసం చేసిన దుండగులు మధుబన్ కాలనీ వద్ద ఉన్న ఎస్బిఐ ఏటీఎంలోకి ఆదివారం రాత్రి చొరబడిన దొంగల ముఠా నగదు చోరీకి యత్నించి విఫలమయ్యారు. ఏటీఎం చోరీకి యత్నించిన సమయంలో షార్ట్ సార్క్యూట్ తో మంటలు రావడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. వరుస చోరీలకు పాల్పడుతున్న ముఠా హరియాణా మేవత్ గ్యాంగ్ గా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఎనిమిది బృందాలుగా ఏర్పాడి నిందితుల కోసం గాలిస్తున్నారు.