12-03-2025 10:14:13 AM
అమరావతి: చిత్తూరు గాంధీరోడ్డులో దొంగల కాల్పుల(Thieves shooting) ఘటనలో కీలక మలుపు చోటుచేసుకుంది. చిత్తూరులో ఓ ప్రముఖ ప్యాపారి ఇంట్లో దోపిడీకి మరో ప్రముఖ వ్యాపారి పన్నాగం పన్నారు. పుష్ప కిడ్స్ వరల్డ్ యజమాని చంద్రశేఖర్ ఇంట్లో దోపిడీకి ముఠా ఏర్పాటు చేశారు. ఎస్ఎల్ వీ ఫర్నీచర్(SLV Furniture) యజమాని చంద్రశేఖర్ ఇంట్లో దోపిడీకి ముఠా ఏర్పాటు చేశాడు. కర్నాటక, ఉత్తరాదికి చెందిన దుండగులతో వ్యాపారి ముఠా ఏర్పాటు చేశాడు. రబ్బర్ బుల్లెట్లు వినియోగించే తుపాకులతో చంద్రశేఖర్ ఇంట్లో దోపిడీకి ప్రయత్నించారు.
పుష్పకిడ్స్ వరల్డ్(Pushpa Kids World) యజమాని చంద్రశేఖర్ ఇంట్లోకి వెళ్లాక దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పుష్పకిడ్స్ వరల్డ్ యజమాని చంద్రశేఖర్ కు గాయాలయ్యాయి. ఇంట్లో దుండగులు చొరబడటంతో చంద్రశేఖర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అప్రమత్తమై రంగంలోకి దిగిన పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరులోని గాంధీరోడ్డు(Gandhi Road) పరిసరాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దుండగులు కోసం రెండున్నర గంటల పాటు పోలీసులు ఆపరేషన్ నిర్వహించారు. పోలీసులు రెండున్నర గంటల తర్వాత గాంధీ రోడ్డులో సాధారణ పరిస్థితి తెచ్చారు. చోరీకి ముఠా ఏర్పాటు చేసి ఎస్ఎల్ వీ ఫర్నీచర్ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.