calender_icon.png 6 October, 2024 | 1:32 PM

దేశవ్యాప్తంగా 319 కేసులు.. కీలక సైబర్ నేరగాళ్ల అరెస్ట్

06-10-2024 11:40:57 AM

హైదరాబాద్: సైబర్ నేరాలకు పాల్పడుతున్న కీలక నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కర్నాటక, మహారాష్ట్ర, రాజస్థాన్ లో సైబర్ క్రైమ్ పోలీసులు ఆపరేషన్ నిర్వహించారు. 18 మంది సైబర్ నేరగాళ్లను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై రాష్ట్రంలో 45కు పైగా కేసులు ఉన్నట్లు గుర్తించారు.

నిందితులపై దేశవ్యాప్తంగా 319 కేసులు ఉన్నాయి. నిందితుల నుంచి రూ. 5 లక్షల నగదు, 26 ఫోన్లు, 16 ఏటీఎం కార్డులు, పాసు బుక్కులు స్వాధీనం చేసుకున్నారు. ఆరు ప్రత్యేక బృందాలు సైబర్ నేరగాళ్లు కోసం గాలిస్తున్నారు. దేశవ్యాప్తంగా కొరియర్, పెట్టుబడి పేరుతో మోసాలు జరుగుతున్నాయి. ఓటీపీ, ఇన్సూరెన్స్ పేర్లతో నిందితులు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. నిందితుల బ్యాంకు ఖాతాలోని రూ. 1.61 కోట్లను పోలీసులు సీజ్ చేశారు.తెలంగాణలో నమోదైన కేసుల్లో బాధితుల నుంచి రూ. 6.94 కోట్లను కాజేశారు.