calender_icon.png 13 February, 2025 | 7:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ నేరస్తుల ముఠాలో కీలక నిందితుడి అరెస్టు

13-02-2025 01:14:39 AM

వనపర్తి టౌన్, ఫిబ్రవరి 12 : ధ్వని లోన్ యాప్ ద్వారా రూ 2 కోట్ల ను కాజేసిన కకీలక సైబర్ నేరస్తుడు పట్టుకుని అతని నుండి రూ,, 4 లక్షల నగదు, 6 సెల్ పోన్లు  స్వాధీనం చేసినట్లు  ఎస్పీ రావుల గిరిధర్  తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రం లపని ఎస్పీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు.

వనపర్తి జిల్లాలో ధ్వని లోన్ యాప్ ద్వారా పెద్ద మొత్తం లో వనపర్తి జిల్లాకు చెందిన సైబర్ నేరస్తులో ఇప్పటికే ముగ్గురిని పట్టుకుని రిమాండ్ తరలించడం జరిగింది. ఇందులో ప్రధాన నిందితుడు కట్రావత్ వెంకటేష్ ను పక్కా సమాచారం తో బుధవారం పట్టుకొని విచారించగా నేరం ఒప్పుకున్నాడన్నారు.

పట్టుకున్న నిందితుడు తాను సైబర్ నేరాలు చేసి కమీషన్ రూపంలో ఇప్పటి వరకు దాదాపు పది లక్షల రూపాయల నరకు సంపాదించినాడు, అందులో నుంచి 4 లక్షల రూపాయలను పోలీసులు స్వాదీనం చేసుకున్నామన్నారు ఈ సమావేశంలో సైబర్ క్రైమ్ డిఎస్పి, రత్నం, వనపర్తి డిసిఆర్బి డిఎస్పీ, ఉమామహేశ్వరరావు, వనపర్తి సిఐ కృష్ణయ్య, సైబర్ క్రైమ్ ఎస్సు,రవి ప్రకాష్,, ఫైబర్ క్రైమ్ పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.