calender_icon.png 15 November, 2024 | 1:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మస్క్, వివేక్‌కు కీలక బాధ్యతలు

14-11-2024 12:24:12 AM

వాషింగ్టన్, నవంబర్13: అధ్యక్ష ఎన్నికల్లో విజయఢంకా మోగించిన డొనాల్డ్ ట్రంప్ తన కార్యవర్గ కూర్పుపై ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన గెలుపులో కీలక పాత్ర పోషించిన ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్, ఇండియన్ అమెరికన్ వివేక్ రామస్వామికి కీలక బాధ్యతలు అప్పగించారు. వీరిద్దరికీ ఎఫిషియెన్సీ శాఖ బాధ్యతలు అప్పగిస్తూ ట్రంప్ తాజాగా ప్రకటన విడుదల చేశారు.

మస్క్, వివేక్‌లు తన ప్రభుత్వంలో అధికార యంత్రాంగం ప్రక్షాళన, మితిమీరిన నిబంధనల కోత, అనవసర ఖర్చు తగ్గింపు, ఫెడరల్ ఏజెన్సీల పునర్నిర్మాణం వంటి బాధ్యతలను నిర్వర్తిస్తారని పేర్కొన్నారు. సేవ్ అమెరికా  ఉద్యమంలో వీరిద్దరూ తీసుకోబోయే చర్యలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అంతేకాకుండా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్‌గా నేషనల్ ఇంటెలిజెన్స్ మాజీ డైరెక్టర్ జాన్ రాట్‌క్లిఫ్‌ను ట్రంప్ నియమించారు.

కాగా, ఎన్నికల సమయంలో మస్క్ పెద్ద మొత్తంలో ట్రంప్‌కు విరాళాలు అందించడంతోపాటు ఆయనకు మద్దతుగా ప్రచారం కూడా చేశారు. అలాగే వివేక్ రామస్వామి తొలుత అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ పడినా తర్వాత బరిలోంచి తప్పుకుని ట్రంప్ గెలుపు కోసం కృషి చేసిన విషయం తెలిసిందే.