20-03-2025 01:30:40 AM
అల్లర్లతో సంబంధమున్న 60 మంది అరెస్ట్
నిందితుల అరాచకం.. మహిళా కానిస్టేబుల్‌పై లైంగిక దాడికి యత్నం
ఔరంగజేబు సమాధి నేటి తరానిది కాదు: ఆర్‌ఎస్‌ఎస్
నాగ్‌పూర్, మార్చి 19: నాగ్‌పూర్ అల్లర్ల కేసులో ప్రధాన సూత్రధారి అని భావిస్తున్న ఫహీమ్ ఖాన్‌ను పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అల్లర్లకు ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తూ ఫహీమ్ ఖాన్ ఫోటోను అధికారులు విడుదల చేశారు. కాగా మైనారిటీ డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఫహీమ్ ఖాన్ సహా అల్లర్లతో సంబంధమున్న 60 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో నాగ్‌పూర్ నియోజకవర్గం నుంచి ఫహీమ్ ఖాన్ బీజేపీ అగ్రనేత నితిన్ గడ్కరీపై పోటీ చేయడం గమనార్హం. నాగ్‌పూర్ హింసకు కారణం ఒక వ్యవస్థ లేదా సంస్థ అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ అల్లర్లలో ఇప్పటివరకు ఆరు కేసులు నమోదు కాగా 1200 మందిపై ఫిర్యాదులు అందాయి.
కానిస్టేబుల్‌పై లైంగిక దాడికి యత్నం
నాగ్‌పూర్ అల్లర్ల కేసులో దుర్మార్గమైన చర్యలు వెలుగులోకి వస్తున్నాయి. సోమవారం జరిగిన హింసాకాండలో నిందితులు అరాచకాలకు పాల్పడ్డారు. డ్యూటీలో ఉన్న మహిళా కానిస్టేబుల్‌పై లైంగిక దాడికి య ఈ నేపథ్యంలో ఆమె యూనిఫాంను చింపివేసి అసభ్యంగా ప్రవర్తిం తెలుస్తోంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన తోటి పోలీసులు ఆమెను రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. కాగా అల్లరిమూకపై గణేశ్ పేట్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆర్‌ఎస్‌ఎస్ కీలక వ్యాఖ్యలు
అల్లర్ల నేపథ్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) కీలక వ్యాఖ్యలు చేసింది. ఔరంగజేబు సమాధి నేటి తరానికి సంబంధించినది కాదని, ఏ రకమైన హింస సమాజానికి మంచిది కాదని ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ నేత సునీల్ అంబేకర్ అన్నారు.
అసలేం జరిగింది?
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్‌లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని తొలగించాలంటూ విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ నిరసన చేపట్టడం మత ఘర్షణలకు దారి తీసింది. అల్లర్లలో భాగంగా ఒక వర్గం ఇళ్లను, వ్యాపారాలను టార్గెట్ చేస్తూ మరో వర్గం దాడులకు పాల్పడింది.
ఈ సందర్భంగా మత గ్రంథాలను కాల్చేసినట్లు పుకార్లు వ్యాపించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనలో 30కి పైగా గాయపడగా.. అందులో పోలీసులు కూడా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.