07-03-2025 02:04:56 PM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పిల్లల అమ్మకాల కేసులో కీలక సూత్రధారి అరెస్ట్ అయింది. అహ్మదాబాద్ లో వందనను రాచకొండ పోలీసులు(Rachakonda Police) అరెస్ట్ చేశారు. వందన అహ్మదాబాద్ నుంచి పిల్లల్ని తెచ్చి హైదరాబాద్‌లో అమ్మిన విషయం తెలిసిందే. నలుగురు బ్రోకర్లకు నలుగురు పిల్లలను అమ్మింది. ఒక్కో చిన్నారిపై వందన రూ.5 లక్షలు వసూల్ చేసింది. హైదరాబాద్ తీసుకొచ్చిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. వందనను 5 రోజుల కస్టడీ ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ వేయనున్నారు. ఈ కేసులో ఇప్పటి రవకు 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.