calender_icon.png 11 March, 2025 | 6:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గచ్చిబౌలి కాల్పుల ఘటనలో కీలక అంశాలు

02-02-2025 04:51:48 PM

హైదరాబాద్: గచ్చిబౌలి(Gachibowli) కాల్పుల ఘటన కేసులో పోలీసులు కీలక అంశాలు దర్యాప్తు చేశారు. గచ్చిబౌలిలోని ప్రిజం పబ్బు(Prism Pub)లో పోలీసులపై కాల్పులు జరిపి తప్పించుకునే ప్రయత్నం చేసిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ ను సీసీఎస్(CCS), ఎస్వోటీ క్రైమ్ బృందాలు(SOT crime teams) విచారిస్తున్నారు. ఇప్పటికే నిందితుడు ప్రభాకర్ నుంచి పోలీసులు 3 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. బీహర్ నుంచి తుపాకులు కొనుగోలు చేసినట్లు పోలీసులు అనుమనిస్తున్నారు. ప్రభాకర్ పై తెలుగు రాష్ట్రాల్లో 80 కేసులు ఉన్నాట్లు విచారణ ద్వారా గుర్తించారు.