హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. తక్షణమే పిటిషన్లను స్పీకర్ ముందు ఉంచాలని, నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోకపోతే, నాగేందర్ దానం, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్ రావులపై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కోర్టు పునఃప్రారంభించాలని స్పీకర్ కార్యదర్శిని ఆదేశించారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేసేలా స్వీకర్ ను ఆదేశించాలని బీఆర్ఎస్ నేతలు పిటిషన్ వేశారు. దానం నాగేందర్, కడియం శ్రీహారి, తెల్లంపై అనర్హత వేటు వేయాలని కౌశిక్ రెడ్డి, వివేకానందగౌడ్ పిటిషన్ వేశారు. దానంపై అనర్హత వేటు వేయాలని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖాలు చేశారు.