హైదరాబాద్: ఏదొక కేసులో ఇరికించి నన్ను అరెస్టు చేస్తారని ఎప్పుడో తెలుసు అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. రైతుల గొంతుకైనందుకు.. అరెస్టు చేస్తే గర్వంగా జైలుకు పోతానని చెప్పారు. కుట్రలకు భయపడేవాళ్లు ఎవరూ లేరు.. అరెస్ట్ చేసుకో రేవంత్ రెడ్డి కేటీఆర్ స్పష్టం చేశారు. ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా?, అల్లుడు, అన్న కోసం.. రైతన్న నోట్లో మట్టికోట్టడడం కుట్ర కాదా? 9 నెలలుగా రైతుల జీవితాలను రోడ్డున పడేయటం కుట్ర కాదా? మర్లపడ రైతులు ఎదురు తిరిగినందుకు చిత్రహింసలు పెట్టారని కేటీఆర్ ధ్వజమెత్తారు. బ్యాగులతో దొరికిన దొంగలకు, రైతుకష్టం కుట్రగా కాకా ఎలా కనిపిస్తోంది? అంటూ కేటీఆర్ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.