30-04-2025 12:00:00 AM
భూ-భారతి అవగాహన సదస్సులో కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూ భారతి చట్టంపై ప్రజలకు, రైతులకు అవగాహన కల్పించేందుకు ఆదిలా బాద్ జిల్లా అధికార యంత్రాంగం పలు అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే సాత్నాల మండలం, తలమడుగు మండలంలో మంగళవారం నిర్వహించిన భూ భారతి చట్టం అవగాహన సదస్సులో డీసీసీబీ చైర్మన్ అడ్డీ బోజారెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాల్గొ న్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయా మండల రైతులు వివిధ భూమి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ మాట్లాడు తూ కొత్త భూభారతి చట్టం రైతుల సమస్యల పరిష్కారానికి రూపొందించిన చట్టం అని అందరికీ న్యాయం జరిగేలా చట్టం రూపొందించబడిందని తెలిపారు. రైతులు ఎవరూ కూడా ఆందోళన చెందనవసరం లేదని, నూతన చట్టాన్ని ఏప్రిల్ 14వ తేదీన అమలులోకి వచ్చిందని, దీని ఫలితంగా తెలంగా ణ రెవెన్యూ వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు.
ఈ నెల 17వ తేదీ నుంచి 30వ తేది వరకు ఆన్ని మండలాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి, రైతులు ఈ చట్టంలో ఉన్న అంశాల ను తెలుసుకొని, సదస్సులో తెలుసుకున్న విషయాలను గ్రామాలలో ఉన్న ప్రజలకు అవగాహన కల్పించాలని ఆన్నారు. ధరణి స్థానంలో భూ-భారతి పోర్టల్ అందుబాటులోకి వచ్చిందని, భూ భారతి పోర్టల్ ద్వారా నే క్రయవిక్రయాలు జరుగుతాయన్నారు.
భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి గతంలో పోర్టల్లో 33 మాడ్యూళ్లు ఉండేవి. అయితే భూ భారతిలో ఈ విధానాన్ని సులభతరం చేశారని, మాడ్యూళ్ల సంఖ్యను 33 నుంచి 6 కు కుదించారన్నారు. ఈ నూతన చట్టం ప్రకారం మ్యుటేషన్‌కు మ్యాప్ తప్పనిసరిగా ఉంటుందని, వారసత్వ భూముల విషయంలో తప్పులు జరగకుండా చర్యలు, క్షేత్రస్థాయి విచారణ తర్వాతే ప్రక్రియ ముందుకు సాగుతుందని, నిర్ణీత కాలంలో విచారణ చేసిన తర్వాతనే పాస్ పుస్తకాలు జారీ అవుతాయన్నారు.
భూ భారతి చట్టంలో భూమి హక్కు లు భద్రం, భూ సమస్యల సత్వర పరిష్కారం కొరకు రైతు మేలు కోసం ప్రజాపాలన లో చారిత్రక మార్పు వచ్చిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సలోని, అదనపు కలెక్టర్ శ్యామలా దేవి, తహసీల్దార్లు రాజేశ్వరీ, రాజ్ మోహన్ పీఏసీఎస్ చైర్మన్ లు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.