23-02-2025 11:29:02 PM
మహాశివరాత్రికి స్వామివారి దర్శనం కోసం వేలాది మంది భక్తులు రాక
మహాశివరాత్రికి ముస్తాబైన కేతకీ ఆలయం
జహీరాబాద్/ ఝరాసంగం ఫిబ్రవరి 2౩: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయం మహాశివ రాత్రి ఉత్సవాలకు ముస్తాబయింది. మహాశివరాత్రి రోజు వేలాదిమంది భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నవాహ్నిక బ్రహ్మోత్సవాల కోసం దేవా దాయ ధర్మాదాయ శాఖ భారీ ఏర్పాట్ల చేస్తుంది. స్వామి వారి బ్రహ్మోత్సవాలను ఆదివారం వైభవంగా ప్రారంభించారు. జాతర మహోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అధికార యంత్రం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
కేతకి సంగమేశ్వర స్వామి జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు జహీరాబాద్ ఆర్డిఓ రాంరెడ్డి పర్యవేక్షణలో ఏర్పాటు చేస్తున్నారు. మహాశివరాత్రి జాతర ఉత్సవాలకు తెలం గాణ, ఏపీ తోపాటు కర్ణాటక, మహారాష్ట్ర కు చెందిన భక్తులు హాజరై స్వామివారికి పూజలు చేస్తారు. ఈ ఉత్సవాలకు మన రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్ర ప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాల నుండి భక్తులు వేలాదిగా వచ్చి శివయ్య దర్శనాన్ని చేసుకుంటారు. శివమాల ధరించిన భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
కేతకీలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు
కేతకి సంగమేశ్వర స్వామి జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభ మయ్యాయి. ఉత్సవాల్లో కుంకుమార్చన, ధ్వజారోహణ, కలశపూజ, విఘ్నేశ్వర పూజ రుద్రాభిషేకం పల్లకి సేవ భజన కార్యక్ర మాలు నిర్వహించారు. 24న రుద్రాభిషేకం ,కుంకుమార్చన రాత్రి పల్లకి సేవ భజన కార్యక్రమాలు చేస్తారు. 25న రుద్రాభిషేకం కుంకుమార్చన శేష వాహన సేవ గ్రామంలో ఊరేగింపు, పల్లకి సేవ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు.
26న మహా శివరాత్రి, అగ్ని ప్రతిష్ట గణపతి హోమం అభిషేకం రాత్రి 12 గంటలకు లింగోద్వ మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం రిత్వికరణ పల్లకి సేవ, 27న అభిషేకం కుంకుమార్చన రుద్ర సహకార నవగ్రహ సేవ, అగ్ని ప్రతిష్ట కార్యక్రమాలు ఉంటాయి. 28న అగ్నిగుండం, రుద్ర సహకారం పూర్ణాహుతి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం, విమాన రథోత్సవం పల్లకి సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఉత్సవాలకు భక్తులు సహకరించాలి..
మహాశివరాత్రి ఉత్సవాలకు భక్తులు సహకరించాలని ఆలయ ఈవో శివ రుద్రప్ప కోరారు. భక్తులందరూ సహకరించి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల న్నారు. శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి జాతర మహోత్సవాలను పోలీసులు అకడ్బందీగా ఏర్పాటు చేశారన్నారు. భక్తులు సహకరించి స్వామివారి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని కోరారు.
- శివ రుద్రప్ప, ఆలయ ఈవో