* ప్రారంభించిన డీసీసీ అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి
గజ్వేల్, జనవరి 13: గజ్వేల్ పట్టణం లోని వెజ్ నాన్ వెజ్ కూరగాయల మార్కె ట్ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మొట్టమొదటగా కైట్ ఫెస్టివల్ నిర్వహిం చారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తూoకుంట నర్సారెడ్డి కైట్ ఫెస్టివల్ ప్రారంభించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిం చారు .
సంక్రాంతి పర్వదినాలలో చిన్న పెద్ద తేడా లేకుండా గాలిపటాలు ఎగురవేయడం ప్రత్యేకతగా నిలుస్తున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ సంతోషాల మధ్య గడుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు.
అయితే మూడు రోజులపాటు కనుమ, భోగి, మకర పండగలు నిర్వహిం చుకుంటూ ఉండగా కుటుంబ సభ్యులతో కలిసి ఆటపాటలతో సందడి చేసుకోను న్నట్లు చెప్పారు. గోదావరి జిల్లాల్లో కోడిపందాలకు పెట్టింది పేరని, అయితే ఆర్థికంగా నష్టపోతుండడంతో తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వం నిషేధించినట్లు పేర్కొన్నారు.
అయితే అత్యంత ప్రమాదమైన చైనా మాంజ వినియోగించి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని కోరారు. ప్రజలంతా జరుపుకొని సుఖసంతోషాలతో ఉండాలని, రైతులంతా చక్కని పంటలు పండించాలని ఈ సందర్భంగా ఆయన కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మడుపు భూం రెడ్డి, ఆయా మండలాల పార్టీ బాధ్యులు శ్రీనివాస్ రెడ్డి, సందీప్ రెడ్డి, శ్రీనివాస్, కిష్టా గౌడ్, రవీందర్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు గంగిశెట్టి రాజు, విజయలక్ష్మి సత్యనారాయణ, మజీద్ కమిటీ చైర్మన్ సయ్యద్ మథిన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు హరినాథ్ గుప్త, కరుణాకర్ రెడ్డి, యాదగిరి, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ వైస్ చైర్మన్ అంక్షా రెడ్డి, నాయకులు మహిపాల్ రెడ్డి, గుంటుకు శ్రీనివాస్, జహీర్, రమేష్ గౌడ్, గాడిపల్లి శ్రీనివాస్, జగ్గయ్య గారి శేఖర్, సారిక శ్రీనివాస్ రెడ్డి, వెంకట్రాంరెడ్డి, శివులు, అంజా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.