ఎంపీ నగేష్...
ఆదిలాబాద్ (విజయక్రాంతి): భారతదేశంలోనే అతిపెద్ద ఆదివాసి జాతరగా పేరొందిన కేస్లాపూర్ నాగోబా జాతరకు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు వచ్చి నాగదేవతకు దర్శించుకుంటారని ఎంపీ గోడం నాగేష్ తెలిపారు. నాగోబా అందరి ఆరాధ్య దైవమని, ఆ నాగదేవత ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయాల్ శంకర్ తో ప్రభారం నాగోబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మెస్రం వంశీయులు ఎంపీ, ఎమ్మెల్యేలను ఘనంగా సత్కరించారు. అటు గిరిజన సాంప్రదాయాల్లో తమకున్న సంస్కృతి, సంప్రదాయాలు, అలవాట్లు, జీవన విధానంలో అంతర్భాగమనీ ఎంపీ అన్నారు. నాగోబా ఆలయ మరింత అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు. వారి వెంట పలువురు బీజేపీ నాయకులు ఉన్నారు.