హైదరాబాద్: కేశవాపురం రిజర్వాయర్ కాంట్రాక్ట్ ను తెలంగాణ ప్రభుత్వం బుధవారం రద్దు చేసింది. మేఘా ఇంజినీరింగ్ కంపెనీకి ఇచ్చిన రూ. 2 వేల కోట్ల కాంట్రాక్టు రద్దు చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొండపోచమ్మ సాగర్ నుంచి హైదరాబాద్ కు జలాల తరలింపును ప్రభుత్వం విరమించుకుంది. కేశవాపురం ద్వారా హైదరాబాద్ కు జలాల తరలింపును కూడా ప్రభుత్వం విరమించుకుంది. మల్లన్న సాగర్ నుంచి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు జలాలు తరలించేలా పత్రిపాదనలు చేసింది. మల్లన్న సాగర్ నుంచి 15 టీఎంసీలు పంపింగ్ చేసే ప్రాజెక్టును కేబినెట్ ఇటీవల ఆమోదించింది. త్వరలో టెండర్లు పిలవాలని హైదరాబాద్ జలమండలిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.