హైదరాబాద్: సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కె. కేశవ రావు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడుగా శనివారం భాద్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి దీపా దాస్ మున్షీ, ఎమ్మెల్యే లు దానం నాగేందర్, గణేష్, కాలే యదయా, ఎంపీ మల్లు రవి, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్సీ ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పాల్గొన్నారు. కేశవరావు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ముచ్చట తెలిసిందే. తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. సీఎంతో పాటు ఢిల్లీ వెళ్లిన కేకే పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.