calender_icon.png 28 December, 2024 | 5:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెమీఫైనల్లో కేరళ

28-12-2024 01:06:02 AM

క్వార్టర్స్‌లో కశ్మీర్‌పై విజయం

హైదరాబాద్: సంతోష్ ఫుట్‌బాల్ టోర్నీ లో కేరళ జట్టు సెమీఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం హైదరాబాద్‌లోని డెక్కన్ ఎరీనా వేదికగా జరిగిన క్వార్టర్ ఫైనల్లో కేరళ 1 జమ్మూ కశ్మీర్‌పై విజయాన్ని సాధించింది. కేరళ తరఫున నసీబ్ రెహమాన్ (73వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించాడు. కాగా నసీబ్‌కు ఇది ఏడో గోల్ కాగా.. టోర్నీలో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాళ్ల జాబితాలో తమిళనాడు ఆటగాడు లిజోతో కలిసి తొలి స్థానంలో ఉన్నాడు. ఇక కేరళ సంతోష్ ట్రోఫీలో సెమీస్‌లో అడుగుపెట్టడం ఇది 31వ సారి. ఆదివారం జరగనున్న సెమీస్‌లో మణిపూర్‌ను ఎదుర్కోనుంది. కాగా గురువారం ఢిల్లీతో జరిగిన క్వార్టర్స్‌లో మణిపూర్ 5 విజయం సాధించింది.