calender_icon.png 23 December, 2024 | 6:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేరళ ప్రభుత్వం దేశానికి దిక్సూచి

23-12-2024 01:20:27 AM

* కేరళ సంఘీభావ సభలో, ప్రజాసంఘాల నాయకులు

మంథని, డిసెంబర్ 22 (విజయక్రాంతి): కేరళ రాష్ర్ట సంఘీభావ సభను సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో మంథని మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో ఆదివారం బూడిద గణేష్  అధ్యక్షతన నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యం రావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బూడిద గణేష్, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుండి కేరళ ప్రభుత్వానికి రావలసిన వాటా రూ. 57,400 కోట్లు కేంద్రం చెల్లించడానికి కేరళ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లాల్సి వచ్చిందని, రాష్ట్రానికి రావలసిన జిఎస్టి పర్సంటేజీ తగ్గించిందని, కేరళ రాష్ర్టం అప్పులు తీసుకురావడానికి కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతించడం లేదని, వరదల్లో 400 మందికి పైగా చనిపోయి 100 మంది కనపడకుండా వెళ్లి వేలాది కోట్లు నష్టం జరిగితే రాష్ర్ట ప్రభుత్వం 2,138 కోట్లు అడిగితే కేవలం 100 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుందని, వామపక్ష ప్రభుత్వాన్ని ఇలా ఆర్థిక దిగ్బంధనానికి గురిచేస్తూ, మతం, కులం ఘర్షణలను సృష్టిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని, ముఖ్యమంత్రి, మంత్రుల పైన అక్రమ కేసులు బనాయించి వామపక్ష ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కుట్రలు చేస్తుందని, కేరళ ప్రజల ప్రజాస్వామిక హక్కులను కాలరాయడానికి అనేక విధాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని,  అందుకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ విధానాలను బలపరుద్దాం అని వారు పిలుపునిచ్చారు. ఈ సభలో సిఐటియు నాయకులు మల్లేష్, సింగారపు గట్టయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ప్రసాద్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.