calender_icon.png 8 January, 2025 | 12:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నితీశ్ రాణే వ్యాఖ్యలపై కేరళ సీఎం సీరియస్

01-01-2025 01:12:49 AM

* కేరళను ‘మినీ పాకిస్థాన్’గా పేర్కొన్న రాణే

తిరువనంతపురం, డిసెంబర్ 31: కేరళను మినీ పాకిస్థాన్‌గా పేర్కొంటూ మహారాష్ట్ర మంత్రి నితీశ్ రాణే చేసిన వ్యాఖ్యలపై మంగళవారం సీఎం పినరయి విజయన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాణే వ్యాఖ్యలు ఆక్షేపణీయమన్నారు. కేరళ మినీ పాకిస్థాన్ అని, ఏఐసీసీ అగ్రనేతలు, ఎంపీలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ ఉగ్రవాదులని సోమవారం మహారాష్ట్ర మంత్రి నితీశ్ రాణే ఓ సభలో వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలపై సీఎం విజయన్ స్పందించారు. రాణే వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని, ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. వెంటనే రాణే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాణే ఒక రాష్ట్రంపై విద్వేషంతో వాఖ్యలు చేసినప్పటికీ, ఆయనపై బీజేపీ చర్యలు తీసుసుకోకపోవడం బాధాకరమన్నారు.

సంఘ్ పరివార్ శక్తులు పనిగట్టుకుని కేరళపై విద్వేష ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీ, సంఘ్ పరివార్ విభజన రాజకీయాలను ఎదుర్కొనేం దుకు దేశవ్యాప్తంగా ఉన్న లౌకిక, ప్రజాస్వామ్య శక్తులన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.