calender_icon.png 16 January, 2025 | 11:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘మానస’ను సందర్శించిన కెన్యా క్రీడాకారులు

27-08-2024 12:05:40 AM

ఎల్బీనగర్, ఆగస్టు 26: హైదరాబాద్ రన్నర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సోమవారం కెన్యాకు చెందిన మా రథాన్ రన్నర్స్ ఎజికిల్ కిస్కోరిర్, షీలా చె లంగాట్, జెనిత్ కిఫ్టు, హమింగ్టన్ చెరోప్, క్రీ డాకారులు హాజరయ్యారు. అందులో భా గంగా కొత్తపేట మోహన్‌నగర్‌లో ఉన్న మానస చిన్నారుల ఆరోగ్య వైకల్యాల అధ్యయన సంస్థ, ప్రత్యేక పాఠశాలను క్రీడాకా రులు సందర్శింరు. ఈ బృందంలో ఢిల్లీకి చెందిన మారథన్ రన్నర్ విపుల్, ఉత్తరాఖండ్‌కు చెందిన భగీరథి, హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన సునీల్‌శర్మ, విజయనగరానికి చెంది న భుగత శ్రీను ఉన్నారు.

మారథాన్ పోటీల ద్వారా సమకూరిన నగదుతోపాటు దాతలు అందజేసిన రూ.5లక్షల చెక్కును పాఠశాలకు అందజేశారు. కృష్ణాష్టమి సందర్భంగా మానసిక దివ్యాంగుల చిన్నారులు రాధాకృష్ణుల వేషధారణలో ఆలరించారు. కార్యక్రమంలో హైదరాబాద్ రన్నర్స్ అసోసియేషన్ కోశాధికారి మదన్‌మోహన్‌రెడ్డి, ప్రతినిధులు రాజేశ్, స్మిత చామిలింగ్, సుందర్ నగేశ్, విజిగీష, గౌతమ్, పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మి, న్యూరో డాక్టర్ మధురిమ పాల్గొన్నారు.