calender_icon.png 11 February, 2025 | 10:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేజ్రీవాల్ అహంతోనే ఢిల్లీలో ఓటమి

11-02-2025 01:25:29 AM

* పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి 

హైదరాబాద్, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే శక్తి ఆమ్‌ఆద్మీపార్టీకి లేదని, కాంగ్రెస్ అగ్రనేత రాహు ల్‌గాంధీ పర్సనాలిటీని డామినేట్ చేసే సత్తా కేజ్రీవాల్‌ది కాదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి మరింత బలోపేతం చేసుకోవాలని రాహుల్‌గాంధీ భా వించి ఉంటారని అనుకుంటున్నానని పేర్కొన్నారు. సోమవారం జగ్గా రెడ్డి మీడియాతో ఇష్టాగోష్టిగా మా ట్లాడుతూ.. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, అదే కోవలో ఢిల్లీ ఫలితాలను కూడా చూడాలన్నారు.

మొన్నటి వరకు ఇండియా కూటమిలో ఉన్న కేజ్రీవాల్‌కు ఇటీవల అ హం పెరిగిందని, అందుకే ఓడిపోయారని ఆరోపించారు. ఎన్నికల్లో ఒంటరిగానే కొట్లాడటానికి సిద్ధం కావాలని ఢిల్లీ ఎన్నికల ద్వారా రా హుల్‌గాంధీ పార్టీ కేడర్‌కు ఇండికేషన్ ఇచ్చారని భావిస్తున్నట్లు జగ్గారె డ్డి చెప్పారు.