calender_icon.png 23 January, 2025 | 7:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీలో అధికారంలోకి వస్తే నిరుద్యోగాన్ని నిర్మూలిస్తాం

23-01-2025 02:54:19 PM

న్యూఢిల్లీ,(విజయక్రాంతి): ఫిబ్రవరి 5న జరుగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు తామ ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నాయి. వరుసగా మూడోసారి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. తాజా ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరో ఎన్నికల హామీని ప్రకటించారు.  ఢిల్లీలో ఆప్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే ఐదేళ్లలో నిరుద్యోగ సమస్య లేకుండా నిర్మూలిస్తామని కేజ్రీవాల్‌ ఉద్ఘాటించారు. ఉపాధిపై తామ దృష్టిసారించామని గురువారం ఓ వీడియోను విడుదల చేశారు. యువతకు ఉద్యోగాల కల్పనే పార్టీ ప్రథమ ప్రాధాన్యత అని, ఈ సమస్యను పరిష్కరించేందుకు తమ బృందం ఓ ముసాయిదా ప్రణాళికను రూపొందిస్తుందని పేర్కొన్నారు. ప్రజల మద్దతుతో వచ్చే ఐదేళ్లలో ఢిల్లీలో నిరుద్యోగాన్ని నిర్మూలిస్తామని  పునరుద్ఘాటించారు. పంజాబ్ లో ఆప్ ప్రభుత్వం రెండేళ్లలోనే 48 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని, ప్రైవేట్‌ రంగంలో యువతకు మూడు లక్షల ఉద్యోగాలను అందించిందని కేజ్రీవాల్ తెలిపారు.