బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ, ఆగస్టు 5: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి నిరాశే ఎదురైం ది. కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో బెయిల్ కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. ఎలాంటి కారణం లేకుండానే కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేసిందని చెప్పలేమని, బెయిల్ కోసం ముందుగా ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని హైకోర్టు న్యాయమూర్తి తెలిపారు.
ఢిల్లీ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం. సీబీఐ అరెస్టును సవాల్ చేయడంతో పాటు బెయిల్ కోసం అత్యున్నత న్యాయస్థానంలో అప్పీల్ చేస్తామని ఆయన తరఫున న్యాయవాదులు తెలిపారు.