calender_icon.png 22 December, 2024 | 6:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్

13-09-2024 11:13:55 AM

ఢిల్లీ: మద్యం కుంభకోణంలో అవకతవకల వ్యవహారంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయనకు తిహార్ జైలు నుంచి బయటకు విడుదల కానున్నారు. సీబీఐ కోర్టులో మద్యం విధానానికి సంబంధించిన పాలసీని రూపొందించడం, టెండర్ లను పిలవడంపై పలు అభియోగాలు ఉన్నాయి. ఇప్పటికే మద్యం కుంభకోణం కేసునుంచి బీఆర్ఎస్ ఎంఎల్సీ కే.కవిత ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలకు  బెయిల్ లభించింది.  కాగా ఢిల్లీ ముఖ్య మంత్రిగా తన విధులను కేజ్రీవాల్ జైలు నుంచే తన మంత్రివర్గ సహచరులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.