08-02-2025 03:44:44 PM
న్యూఢిల్లీ,(విజయక్రాంతి): ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో(Delhi Assembly Elections) ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) విజయం సాధిస్తామని శనివారం ఉదయం వరకు నమ్మకంగా ఉన్నది. ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న సమయంలో భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) చాలా నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉంది. అనంతరం అధికార పార్టీ ఆప్ ని షాక్‌లో ముంచెత్తింది. మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ వంటి ప్రముఖ నాయకులు పరాజయం పొందారు. ఆప్ పార్టీ భారీ ఓటమిపై మొదటిసారి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ప్రజల తీర్పును వినయంగా అంగీకరిస్తున్నానని, వారి నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.
ప్రజాసేవ చేయాలనే ఏకైక ఉద్దేశ్యంతో తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఎన్నికల్లో ఓడినా ప్రజలకు అండగా నిలబడటానికి కట్టుబడి ఉందని ఆయన హామీ ఇచ్చారు. ఎన్నికల ఫలితాలు తన స్ఫూర్తిని తగ్గించవని కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. ఎన్నికల్లో తీవ్రంగా పోరాడిన ఆప్ నాయకులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన పదవీకాలాన్ని గుర్తుచేసుకుంటూ, గత దశాబ్దంలో ఢిల్లీలో జరిగిన గణనీయమైన మెరుగుదలను ప్రస్తాయించారు. ముఖ్యంగా నీటి సరఫరా, విద్యుత్, ఇతర ముఖ్యమైన సేవలను ఉద్దేశించి కేజ్రీవాల్ మాట్లడారు. ఈ వ్యాఖ్యలను కేజ్రీవాల్ వీడియో సందేశం ద్వారా తెలియజేశారు.