calender_icon.png 20 November, 2024 | 9:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేజ్రీవాల్ విడుదల

14-09-2024 03:15:00 AM

షరతులతో బెయిల్ మంజూరుచేసిన సుప్రీంకోర్టు

సీబీఐ తీరుపై అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం

పంజరంలో చిలుకలా వ్యవహరిస్తోందని ఆగ్రహం

ఆర్నెల్ల తర్వాత ఆమ్‌ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఆయనకు సుప్రీంకోర్టు శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. తీర్పు వెలువరించే సమయంలో సీబీఐ తీరుపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.

ఈడీ కేసులో బెయిల్ లభించిన వెంటనే సీబీఐ వ్యూహాత్మకంగా కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిందని మండిపడింది. సీబీఐ పంజరంలో చిలుకలా వ్యవహరిస్తోందని, ఈ అపవాదు నిజం కాదని నిరూపించుకోవాలని సూచించింది. వర్షం పడుతున్నా లెక్కచేయకుండా అభిమానులు కేజ్రీవాల్‌కు స్వాగతం పలికేందుకు తీహార్ జైలు వద్దకు వచ్చారు. జైలు నుంచి బయటకు వచ్చిన కేజ్రీవాల్.. తన జీవితం దేశానికే అంకితం ఇచ్చానని, విచ్ఛిన్న శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.