- అయినా జైలులోనే ఉండనున్న ఢిల్లీ సీఎం
- సీబీఐ కేసే కారణం..
- రాజీనామా అనేది ఆయన ఇష్టం
న్యూఢిల్లీ, జూలై 12: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. ఈడీ నమోదు చేసిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ సంజీవ్ కన్నాల ధర్మాసనం శుక్రవారం తీర్పు చెప్పింది. ఆప్ అధినేతకు బెయిల్ మంజూరైనా సీబీఐ కేసు ఉండడంతో బయటకు వచ్చే అవకాశం లేదు.
అది ఆయన ఇష్టం..
అరెస్టు నేపథ్యంలో సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తు న్నారు. ఈ విషయంపైనా సుప్రీం స్పందించింది. ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి అరెస్ట్ అయ్యారు కాబట్టి రాజీనామా చేయాలా? లేదా? అన్నది ఆయన ఇష్టం. ఇందులో కోర్టు జోక్యం చేసుకోదన్నారు. కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరైనా ఆయన సీఎం కార్యాలయానికి వెళ్లలేరు. ఏ ఫైళ్ల మీద సంతకాలు చేయలేరు అని బీజేపీ ఎంపీ, లాయర్ బన్సూరి స్వరాజ్ తెలిపారు. మేలో బెయిల్ వచ్చినప్పటి నిబంధనలే ప్రస్తుతం ఉంటాయని తెలిపారు.