09-02-2025 01:35:29 AM
27 ఏండ్ల తర్వాత అధికార పగ్గాలు..
‘ఆప్’ను ఊడ్చిపారేసిన ఓటర్లు
సంబురాల్లో మునిగిన కమలనాథులు
27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత హస్తినలో ‘కమలం’ వికసించింది. ఢిల్లీ పీఠాన్ని దక్కించుకుని విజయ బావుటా ఎగురవేసింది. 2013 నుంచి ఢిల్లీని ఏలుతూ.. ‘మాకు ఎదురొచ్చేదెవరు ? మమ్మల్ని ఢీ కొట్టేదెవరు ?’ అని సవాల్ విసిరిన ‘ఆప్’ను ఊడ్చి పడేశారు. ఎన్ని ఉచిత పథకాలకు రూపకల్పన చేసినా కేజ్రీ‘వాల్’ను కూలదోశారు. లిక్కర్ కుంభకోణం, శీష్ మహల్ ఎపిసోడ్ వంటివి ఎన్నికల్లో ఆప్‌కు మైనస్ అయినట్లు ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తున్నది.
“ప్రధాని మోదీజీ మీరెంత ప్రయత్నించినా ఆప్‌ను ఢిల్లీలో ఓడించడం జన్మలో సాధ్యం కాదు” అని నిన్నమొన్నటి వరకు సవాల్ విసిరిన ఆప్ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ ఇక నుంచి ‘కల చెదిరింది.. కథ మారింది..’ అని పాడుకోవాలేమో! ఎన్నికల్లో ఆప్ అధినేత కేజ్రీవాల్,
మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, పార్టీ నేత సౌరభ్ భరద్వాజ్ ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఎన్నికల సమయంలో సీఎంగా వ్యవహరించిన ఆప్ నేత అతిశీ మాత్రం స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. కొత్త ప్రభుత్వానికి కేజ్రీవాల్, అతిశీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాతీర్పుకు కట్టుబడి ఉంటామని ప్రకటించారు. ఇకపై కూడా బీజేపీపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
మరోవైపు కాంగ్రెస్ వరుసగా ‘హ్యాట్రిక్’ పరాభవాన్ని మూటగట్టుకుంది. నాయకత్వ లేమి, వ్యవస్థాగత లోపాలతో తన రాజకీయ భవిష్యత్తును సమాప్తం చేసుకున్నది. బీజేపీ ఢిల్లీ పీఠాన్నైతే కైవసం చేసుకుంది కానీ.. ఇంకా సీఎం అభ్యర్థిని మాత్రం ప్రకటించలేదు. సీఎం పదవి ఎవరిని వరిస్తుందోనని.. సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
ఢిల్లీ ప్రజలకు విముక్తి
ఢిల్లీ ప్రజలకు ‘ఆప్’ నుంచి విముక్తి లభించింది. ఈ గెలుపులో అసలైన విజేతలు ఢిల్లీ ప్రజలే. మీ ప్రేమకు ప్రతిఫలాన్ని అభివృద్ధి రూపంలో చూపిస్తా. అడ్డదారుల్లో వచ్చిన వారికి షాక్ తగిలింది. హస్తిన ప్రజలు మోదీ గ్యారెంటీని విశ్వసించారు. ఢిల్లీ ప్రజల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. వికసిత్ ఢిల్లీగా మార్చి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం. అవినీతి అహంకార ఆప్‌కు ప్రజలు సరైన బుద్ధి చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోదీ
* ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తున్నాం. ఎన్నికల్లో పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు, నాయకులకు ధన్యవాదాలు. ఎన్నికల్లో ఓడిపోయినా.. మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.
రాహుల్, ఏఐసీసీ అగ్రనేత
* ప్రజాసేవకే రాజకీయాల్లోకి వచ్చా. ఎన్నికల్లో ఓడినా ప్రజల వెంటే ఉంటాం. ప్రజల తీర్పును శిరసావహిస్తాం. ప్రజల కోసం ఎన్నో చేసినా ఓడించారు.
కేజ్రీవాల్, ఆప్ అధినేత
ఢిల్లీ గడ్డ.. ఇక బీజేపీ అడ్డా
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: కౌంటింగ్ ప్రారంభమైన కాసేపటికే ఢిల్లీ పిక్చర్ క్లియర్ అయింది. ఎగ్జిట్ పోల్స్ మొదటి నుంచి చెప్పిన విధంగానే ఢిల్లీలో వార్ వన్ సైడ్ అనే విషయం అర్థమైపోయింది. గంటలు గడిచినా కానీ ఆప్ పరిస్థితి ఇంకా దిగజారిందే తప్ప ఏం మెరుగుపడలేదు. ఆ పార్టీ టాప్ లీడర్లు కూడా ఓటమి చెందారు.
చివరకు వచ్చే సరికి ఉన్న 70 సీట్లలో బీజేపీ 48 చోట్ల, ఆప్ 22 జాగాల్లో జెండా ఎగురేశాయి. వరుసగా 3 పర్యాయాలు సీఎం కుర్చీని సొంతం చేసుకుంటూ వస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీ ఓటర్లు కోలుకోలేని దెబ్బ తీశారు. వరుసగా నాలుగోసారి సీఎం పీఠం దక్కించుకోవాలన్న ఆప్ కలలను బీజేపీ కల్లలు చేసింది. ఒకటి కాదు రెండు కాదు..
ఏకంగా 27 ఏండ్ల తర్వాత హస్తిన పీఠంపై కమలదళం కూర్చోబోతోంది. ఈ సారి కూడా కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవకపోవడం గమనార్హం. చాలా ఏండ్ల పాటు హస్తినను పాలించిన హస్తాన్ని ఓటర్లు పట్టించుకోలేదు. కేజ్రీవాల్ ఎన్ని ఉచితాలు ప్రకటిం చినా..
యమునాలో హర్యానా సర్కారు విషం కలుపుతోందని కేజ్రీ ఆరోపణలు గుప్పించినా కానీ ప్రజలు మాత్రం విశ్వసించలేదు. ఇక అదే సమయంలో కేజ్రీవాల్ శీష్ మహల్ వివాదం ప్రభావం చూపించి ఆప్ అధినేత కేజ్రీవాల్ ఓటమితో పాటు పార్టీని కూడా ముంచేసింది.
రిక్త ‘హస్తమే’
వరుసగా మూడో ఏడాది కూడా ఢిల్లీ ఓటర్లు హస్తం పార్టీకి రిక్తహస్తం చూపెట్టారు. గత రెండు పర్యాయాలుగా అక్కడ ఖాతా తెరవని కాంగ్రెస్ ఈసారి కూడా సున్నా సీట్లకే పరిమితం అయింది. బీజేపీ 48 చోట్ల విజయఢంకా మోగించగా.. ఆప్ 22 చోట్ల గెలిచి ప్రతిపక్షానికి పరిమితం అయింది. ఉన్న 70 అసెంబ్లీ స్థానాలను బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలే గెలుచుకున్నాయి.
ఇక ఏ ఇతర పార్టీ కూడా ఢిల్లీ అసెంబ్లీకి వెళ్లేందుకు అర్హత సాధించలేదు. ఆప్‌లో పేరున్న లీడర్లయిన కేజ్రీవాల్, డిప్యూటీ సీఎంగా చేసిన మనీష్ సిసోడియాతో పాటు మంత్రులుగా పని చేసిన సౌరభ్ భరద్వాజ్ వంటి నేతలు ఓటమిపాలయ్యారు. ఢిల్లీ సీఎంగా చేసిన అతిశీ మాత్రం స్వల్ప మెజారిటీతో గట్టెక్కడం గమనార్హం.
ఆప్‌కు మరో షాక్..
మూలిగే నక్క మీద తాటి కాయ పడ్డట్లు.. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమితో ఢీలాపడ్డ ఆమ్ ఆద్మీ పార్టీకి మరో దెబ్బ తగిలింది. ఢిల్లీ సచివా లయాన్ని సీజ్ చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కీలక నిర్ణయం తీసు కున్నారు. ఇందుకు సంబంధించి అన్ని విభాగాలకు ఆయన ఆదేశాలు కూడా జారీ చేశారు.
దీంతో జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ (జీఏడీ) సచివాలయం సీజ్ చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. సచివాలయంలోని అన్ని శాఖల ఇంచార్జిలు, సెక్రటేరియట్ కార్యా లయాలు, మంత్రుల క్యాంపు కార్యాలయాలకు కూడా ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని తెలిపింది.
ఇది పాలనలో భాగమే..
ఈ నిర్ణయం పాలనలో భాగమే అని జీఏ డీ తెలిపింది. అధికార మార్పిడి తరు ణంలో ఎటువంటి రికార్డులు దుర్వినియోగం కాకుం డా చూడటం కోసమే ఈ ఉత్త ర్వులని పే ర్కొంది. ఇప్పటికే ఘోర ఓటమి భారంతో కుంగిపోతున్న ఆప్‌కు ఎల్జీ నిర్ణయం మరిం త చికాకు తెప్పిస్తుంద నడంలో ఎటువంటి సందేహం లేదు. ఎల్జీకి ఆప్‌కు గతంలో కూ డా చాలా సార్లు గొడవలు జరిగాయి. ఇ ప్పుడు ఏకంగా ఎల్జీ ఇటు వంటి ఉత్తర్వులు జారీ చేయడంతో అంతా షాక్ తిన్నారు. మరి అక్కడ ఎటు వంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.
ఢిల్లీ ఫలితాలు (70)
పార్టీ - సీట్లు
బీజేపీ - 48
ఆప్ - 22
కాంగ్రెస్ - 0
ఓడినా కానీ..
ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చా. ఎన్నికల్లో ఓడినా ప్రజల వెంటే ఉంటాం. ప్రజల తీర్పును శిరసావహిస్తాం. ప్రజల కోసం ఎన్నో చేసినా కానీ మమ్మల్ని ఓడించారు. ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ నేతలకు శుభాకాంక్షలు. బీజేపీ దాడులకు తట్టుకుని పోరాడిన ఆప్ నేతలకూ, కార్యకర్తలకు ధన్యవాదాలు.
కేజ్రీవాల్, ఆప్ జాతీయ కన్వీనర్
ఆప్‌కు ఇది దెబ్బే..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం ఆప్‌కు దెబ్బే. నా మీద నమ్మకంతో మరోమారు గెలిపించిన కాల్‌కాజీ ఓటర్లకు కృతజ్ఞతలు. బీజేపీ చేస్తున్న అక్రమాలకు, అవినీతికి వ్యతిరేఖంగా మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.
అతిశీ, సీఎం, ఆప్
అందువల్లే ఓటమి..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమిపై సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందించారు. ‘అరవింద్ విధానాలు, మద్యం పాలసీ, కుంభకోణాలు, నాయకత్వ లోపం ఓటమికి కారణాలు. ఆప్ నేతలకు సలహాలు ఇచ్చినా పట్టించుకోలేదు. ఎన్నికల్లో పోటీలో ఉండే వారికి స్వచ్ఛమైన వ్యక్తిత్వం, స్వచ్ఛమైన మనస్సు ఉండాలని చెప్పినా వారు పట్టించుకోలేదు. నేను ఎంత చెప్పినా కేజ్రీవాల్ పట్టించుకోలేదు’ అని విమర్శించారు.
ఓడిన ప్రముఖులు వీరే..
ఢిల్లీ ఎన్నికల్లో చాలా మంది ప్ర ముఖులు ఓటమి పాలయ్యారు. కొంత మంది మాత్రం ఎటువంటి అంచనాలు లేకుండా విజయం సా ధించారు. కొంత మంది ముందు నుంచి అనుకున్న విధంగానే గెలిచి సత్తా చాటారు.
కేజ్రీవాల్..
ఆప్ జాతీయ కన్వీనర్‌గా ఉన్న ఈ మాజీ సీఎం న్యూ ఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ మీద 4, 089 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. పర్వేశ్ వర్మ ఢిల్లీని పాలించిన సాహిబ్ సింగ్ వర్మ కుమారుడే కావడం గమనార్హం. 2013 నుంచి ఓటమన్నదే లేకుండా కొనసాగుతున్న కేజ్రీకి పర్వేశ్ ఓటమి రుచి చూపించారు.
రమేశ్ బిధూరి
ఎన్నో వివాదాలతో నిత్యం సహవాసం చేసే బీజేపీ నేత రమేశ్ బిధూ రికి బీజేపీ పార్లమెంట్ సీట్ నిరాకరించినా కానీ అసెంబ్లీ సీట్ కేటా యించింది. ఢిల్లీ సీఎం, ఆప్ నేత అతిశీ మీద అతడిని పోటీకి నిలిపింది. ఎన్నికల సభల్లో కూడా రమే శ్ చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కానీ ఈ వ్యాఖ్యలను ఓటర్లు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. ఆయన అతిశీకి గట్టి పోటీ నిచ్చారు. చివరి రౌండ్ వరకు ఆయ నే ఆధిక్యంలో కొనసాగారు. కానీ అనూహ్యంగా అతిశీ చివరి రౌండ్ లో పుంజుకుని 3,521 ఓట్ల తేడాతో విజయం సాధించింది. రమేశ్ ఓట మి పాలైనా కానీ అతడి పేరు మా త్రం సీఎం అభ్యర్థి రేసులో ఉంది.
సందీప్ దీక్షిత్
ఢిల్లీని చాలా రోజుల పాటు పాలించిన షీలాదీక్షిత్ కుమారుడే ఈ సందీప్ దీక్షిత్. కాంగ్రెస్ తరఫున న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. ఈయన ఈ ఎన్నికల్లో విజయం సాధించకపోయినా కానీ ఆప్ అధినేత కేజ్రీవాల్‌కు రావాల్సిన ఓట్లను భారీగా చీల్చేశారు. దీంతో కేజ్రీవాల్ ఓటమిపాలయ్యారు.
మనీశ్ సిసోడియా
ఢిల్లీకి డిప్యూటీ సీఎంగా చేసిన మ నీశ్ సిసోడియా గు రించి చాలా మం దికి తెలుసు. లిక్కర్ కుంభకోణంలో చాలా రోజుల పా టు జైలు జీవితం కూడా గడిపాడు. ఈ ఎన్నికల్లో జంగ్‌పురా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ చేతి లో ఓటమిపాలయ్యారు. గత మూ డు పర్యాయాలుగా ప్రతాప్‌గంజ్ స్థానం నుంచి ఆయన గెలుచుకుం టూ వస్తున్నారు.