బీజేపీ వస్తే పథకాలు బంద్
న్యూఢిల్లీ, జనవరి 26: బీజేపీపై ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పలు ఆరోపణలు గుప్పించారు. బీజేపీ కనుక అధికారంలోకి వస్తే ఢిల్లీలో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలు నిలిచిపోతాయని తెలిపారు. బీ జేపీ కేవలం కార్పొరేట్లకు ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.
వారు తీసుకున్న బ్యాంకు రుణాలను మాఫీ చేస్తూ వారికి బోలెడంత ప్రయోజనం కలిగేలా చేస్తుందని అన్నారు. తాము మధ్యతరగతి వారికి, పేదలకు పలు సంక్షేమ పథకాలు ఇస్తే ఉచితాలు అని ఆరోపిస్తోందని కేజ్రీవాల్ తెలిపారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల ఢిల్లీలోని ప్రతి ఇంటికి నెలకు దాదాపు రూ. 25వేల మేర ప్రయోజనం కలుగుతోందని చెప్పారు.
బీజేపీ కనుక అధికారంలోకి వస్తే ఈ పథకాలన్నీ నిలిచిపోతాయని కేజ్రీవాల్ హెచ్చరించారు. త్వరలోనే ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇటు ఆప్ అటు బీజేపీ ఆరోపణలతో ఢిల్లీ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.