29-03-2025 12:30:08 AM
గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ప్రారంభం
-పాల్గొన్న స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి పొన్నం
పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్
శేరిలింగంపల్లి, మార్చి 28(విజయక్రాంతి): హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం లో శాప్ ఛైర్మన్ శివసేనా రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 4వ కియో జాతీయ కరాటే ఛాంపియన్ షిప్-2025 శుక్రవారం ఘనం గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్,మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, శాప్ ఛైర్మెన్ శివసేన రెడ్డి, ప్రపంచ బాక్సర్ నిక్కత్ జరిన్ అతిథులుగా హాజరై కరాటే పోటీలను ప్రారంభించారు.
ఈ పోటీలు మూడు రోజుల పాటు జరగనున్న నేపథ్యంలో క్రీడాకారులు ఉత్సాహం గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం క్రీడారంగం వైపు కన్నెత్తి కూడా చూడలేదని మంత్రి పొన్నం విమర్శించారు. క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశ్యంతో కొన్నేళ్లుగా ఆగిపోయిన క్రీడలను కూడా ఇప్పుడు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో స్పోరట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. క్రీడలను ప్రోత్సహించే విధంగా మండల స్థాయి,జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయిలో క్రీడలను నిర్వహిస్తామని క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా అవసరమైన అన్ని చర్యలనూ చేపడతామని అన్నారు. క్రీడల్లో అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా ప్రోత్సహిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలు అందిస్తుందని, గడిచిన 10సంవత్సరాలలో తెలం గాణ రాష్ట్రంలో ఇంతటి గొప్ప పోటీలు నిర్వహించుకోకపోవడం పట్ల స్పీకర్ గడ్డం ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా క్రీడలన్నింటికీ తెలంగాణ రాష్ట్రం సెంటర్ పాయింట్గా ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర, జాతీయ, క్రీడలను నిర్వహించడం చాలా గొప్ప విషయమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడలకోసం ప్రత్యేక శ్రద్ధతో తగిన సౌకర్యాలను సమకూర్చి క్రీడాకారులను ప్రోత్సహిం చడం చాలా సంతోషదాయకం అని అన్నా రు. క్రీడాకారులు అవకాశాన్ని సద్వినియో గం చేసుకుంటూ క్రీడలలో ప్రతిభా పాటవాలను ప్రదర్శించి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తేవాలని, క్రీడాకారులను కోరారు.
భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం ఒలింపిక్స్ వేదిక కావాలన్న లక్ష్యంతో ప్రభు త్వం తెలంగాణ నుంచి ప్రపంచ ఛాంపియన్లను తయారు చేయడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. 2036 ఒలంపిక్స్ దృష్టిలో పెట్టుకొని సమగ్ర క్రీడా విధానాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుదలగా పనిచేసి దేశ క్రీడా రంగానికి కేంద్ర బిందువుగా తెలంగాణ రాష్ట్రం ఉండేందుకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల బృందం చిత్త శుద్ధితో పనిచేస్తున్నట్లు తెలిపారు.
క్రీడల్లో నైపుణ్యం కలిగిన విద్యార్థులను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రోత్సహించాల న్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తరహాలో స్పోరట్స్ యూనివర్సిటీని నిర్మించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక బడ్జెట్ లో 465 కోట్ల కేటాయింపులు చేయనున్నట్లు తెలిపారు.అనంతరం కరాటేలో పాల్గొని క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపా రు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, మాదా పూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, పార్టీ నేతలు కార్యకర్తలు నేషనల్ కరాటే అసోసియేషన్ మెంబెర్స్ పాల్గొన్నారు.