కీర్తి సురేశ్ బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తరువాత ‘గీతాంజలి’ సినిమాతో హీరోయిన్‌గా మారింది. ‘నేను శైలజ’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే సౌత్ హీరో ఒకరు ఆమెను పిలిచి మరీ అంకుల్ అనొద్దన్నారట. దానికి సంబంధించిన విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీర్తి సురేశ్ పంచుకుంది. ఆయన మరెవరో కాదు. మలయాళ నటుడు దిలీప్. 2002లో దిలీప్ కథానాయకుడిగా ‘కుబేరన్’ వచ్చింది. దీనిలో ఆయన ముగ్గురు పిల్లల్ని దత్తత తీసుకుంటాడు. వారిలో ఒకరు కీర్తి సురేశ్. ఆ తరువాత 2014లో ‘రింగ్ మాస్టర్’ చిత్రంలో ఆయనకు ప్రేయసిగా కూడా కీర్తి నటించింది. ఈ సినిమా విషయమై తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీర్తి మాట్లాడుతూ.. “దిలీప్ అంటే ఏంటో చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి ఆయన పక్కన హీరోయిన్‌గా నటించేందుకు వెనుకాడలేదు. ‘రింగ్ మాస్టర్’లో నేను హీరోయిన్ అని తెలిసిన వెంటనే నన్ను పిలిచి చిన్నప్పుడైతే అంకుల్ అని పిలిచేదానివి ఇప్పుడు మాత్రం అలా పిలవొద్దు. కావాలంటే చేట్ట (అన్నయ్య) అని పిలువు” అని చెప్పాడు అని తెలిపింది.