20-04-2025 06:27:04 PM
చిట్యాల (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని జడలపేట గ్రామానికి చెందిన మెరుగు సారయ్య, నైన్ పాక గ్రామానికి చెందిన నల్లబెల్లి మల్లమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి చందుపట్ల కీర్తి రెడ్డి వారి కుటుంబ సభ్యులను ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుల చిత్రపటాలకు పూలమాలు వేసి నివాళులర్పించారు. ఆమె వెంట జిల్లా అధ్యక్షుడు ఏడునూతల నిషిదర్ రెడ్డి, మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్, ఓబిసి మోర్చ జిల్లా అధ్యక్షుడు తీగల జగ్గయ్య, శ్రీనివాస గౌడ్, అశోక్ చారి, మల్లారెడ్డి చిన్నవేని సంపత్, తోట్ల మహేష్, చందు, రాజ్ కుమార్, రాజేందర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.