calender_icon.png 20 April, 2025 | 2:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

30 ఏళ్లు దాటాయా?

20-04-2025 12:00:00 AM

మీకు 30 ఏళ్లు దాటాయా? అయితే మీరు తినే ఆహారంలో ఈ పదార్థాలు చేర్చుకుంటే మంచిదట. వీటిని మీ డైట్ లో జతచేసుకోవడం వల్ల స్ట్రోక్ వచ్చే అవకాశాలు తక్కువని నిపుణులు చెబుతున్నారు. మన జీర్ణవ్యవస్థకు మెదడు ఆరోగ్యానికి మధ్య సంబంధం ఉందని 18వ శతాబ్దంలోనే శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఈ నేపథ్యంలోనే వాటిపైన మరింత అధ్యయనం చేశారు. ఇందులో భాగంగా జీర్ణవ్యవస్థలోని సూక్ష్మజీవులు, మంచి బ్యాక్టీరియా.. మెదడు ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో పరిశీలించారు. ఇందులో శరీరంలోని రెండు ప్రధాన భాగాలైన జీర్ణవాహిక, కేంద్ర నాడీ వ్యవస్థ మధ్య పరస్పర కమ్యూనికేషన్ జరిగినట్లు తేల్చారు. ప్రోబయాటిక్స్ గుణాలున్న ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండి మెదడును రక్షిస్తుందని వెల్లడించారు. 

మరోవైపు జీర్ణవ్యవస్థలోని సూక్ష్మ జీవులు, మంచి బ్యాక్టీరి యా సంఖ్య పెరగడండ వ ల్ల దీర్ఘకాలంలో స్ట్రోక్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు తేల్చారు. జీర్ణవ్యవస్థ, మెదడు మధ్య ఉన్న సంబంధంపై చైనాకు చెందిన ఫుడాన్ యూనివర్సిటీ పరిశోధనలు అధ్యయనం చేశారు. నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేష్ సర్వేలోని డేటాను సేకరించి పరిశీలించారు. ఇందులో 20 ఏళ్లు దాటిన వివిధ ప్రాంతాలు, వివిధ ఆహారపు అలవాట్లు ఉన్న 48,677 మంది వివరాలు సేకరించారు.

వీరికి జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని పంచే అవకాడోలు, బ్రకోలీ, కాఫీ, శనగలు, క్రాన్ బెర్రీలు, డెయిరీ పదార్థాలు, సోయా, తృణధాన్యాలు ఆధారంగా ఎక్కువ స్కోర్లు ఇచ్చారు. దీంతోపాటు ప్రాసెస్ చేసిన ఆహారం, మాంసం తీసుకున్న వారికి తక్కువ స్కోర్లు ఇచ్చి విభజించారు. ఇందులో 20-29 ఏళ్ల మధ్య ఉన్నవారిలో ఎలాంటి మార్పులను గమనించలేదని పరిశోధకులు వెల్లడించారు.  అదే 30 ఏళ్లు దాటినవారిలో జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటే.. స్ట్రోక్ వచ్చే అవకాశం తగ్గినట్లు కనిపెట్టారు.

ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం తక్కువని తెలిపారు. మరోవైపు జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా లేకపోవడం వల్ల స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఒక అధ్యయనంలో తేలింది. జీర్ణవ్యవస్థలోని సూకజజీవుల సమతుల్యంగా లేకపోవడం వల్ల హైపర్ టెన్షన్, డయాబెటిస్, ఊబకాయం, జీర్ణక్రియ సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఇవన్నీ దీర్ఘకాలంలో స్ట్రోక్ కు దారితీసే ప్రమాదం ఉందని వివరించారు. అధిక రక్తపోటు, అధిక చక్కెర స్థాయులు, జీర్ణక్రియ సమస్యల వల్ల మెదడులో రక్తం గడ్డకట్టే అవకాశం ఉంటుందని వెల్లడించారు.