జిల్లా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల జిల్లా అధ్యక్షుడు నీలం లింగం డిమాండ్...
కామారెడ్డి (విజయక్రాంతి): సమగ్ర సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సంఘం చేపట్టిన రిలే దీక్షలు ఆదివారం 13వ రోజు నిరవధిక సమ్మె కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉద్యోగులు ఆదివారం ఉద్యోగులు పిల్లల ఆటపాటలతో నిరసన వ్యక్తం చేశారు. నిరవధిక సమ్మెకు మద్దతుగా జిల్లాలోని గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు అందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షులు నీలం లింగం మాట్లాడుతూ.. సీఎం వందరోజుల గ్యారెంటీ ఏమైందని ఇప్పటికీ సంవత్సరం గడుస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యోగుల సేవలు పాఠశాల స్థాయిలో, కాంప్లెక్స్ స్థాయిలో, ఎం ఆర్ సి, కేజీబీవీ, డిపిఓ స్థాయిలో పనిచేసే వారి సేవలు మరువలేని అని విద్య శాఖలో సమగ్ర శిక్ష ఉద్యోగులు లేకుంటే ఆ లోటు ఏంటో ఏర్పడదని ఉద్యోగులు చేస్తున్న సేవకి ప్రభుత్వం గుర్తించకపోవడం బాధాకరమన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు రాష్ట్రస్థాయిలో గెజిటెడ్ ఉపాధ్యాయుల సంఘం మద్దతు ఉంటుందని తెలిపారు. అవసరమైతే రానున్న రోజుల్లో సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల కోసం జిల్లాలోని ప్రధానోపాధ్యాయుల సంఘం పూర్తి మద్దతు తెలుపుతామన్నారు. తాము కూడా నేరుగా ఉద్యమంలో ఉంటామని అన్నారు. అన్ని రకాల సహాయం అందిస్తామని తెలపడం జరిగింది. ఇప్పటికే విద్యా వ్యవస్థలో అన్ని రకాల సేవలు నిలిచిపోయాయన్నారు. రానున్న రెండు రోజుల్లో కేజీబీవీకి తాళాలు వేసి డిఇఓకి అందజేస్తామని తెలిపారు.
ప్రభుత్వానికి ఉద్యోగులు హెచ్చరించారు. నిరసన కార్యక్రమానికి ఉద్యోగులు తమతో పాటు తమ పిల్లల్ని సైతం సమ్మెలో ఉన్నట్టు తెలిపారు. ప్రజా పాలనలో ఆడపడుచులు రోడ్లమీద ఎక్కి నిరసన కార్యక్రమాలు చేపడుతున్న న్యాయం జరిగేది ఎప్పుడు అని, ఇదేనా ప్రజాపాలనని ఉద్యోగులు అడిగారు. ఒకవేళ కేజీబీవీ నాన్ టీచింగ్ వాళ్లను సమ్మె దీక్షలో దింపుతే జరగబోయే పరిణామానికి ప్రభుత్వం బాధ్యతని గుర్తు చేశారు. జిల్లా సమగ్ర శిక్ష జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ మహిళా అధ్యక్షురాలు వాసంతి, నాయకులు సంపత్ రాములు, సంతోష్ రెడ్డి, శైలజ, కాళిదాసు, వీణ, సాయిలు లావణ్య, శ్రీను, మాధవి, యోగేష్, బన్సీలాల్, దినేష్, రాజు, రాధికా, లింగం, కృష్ణ, మాధవి ఉద్యోగులు పాల్గొన్నారు.