calender_icon.png 1 April, 2025 | 10:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాదంతో మెదడు చురుగ్గా!

30-03-2025 12:00:00 AM

రోజు బాదం తినడం వల్ల అనేక లాభాలు పొందొ చ్చు. శారీరకంగా, మానసికంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించడంలో బాదం పప్పులు ఏమాత్రం తగ్గవు. అందుకే ఈ మధ్య చాలా మంది తమ డైలీ రోటీన్‌లో వీటిని భాగం చేసుకుంటున్నారు. బాదంపప్పుల్లో న్యూట్రియంట్లు అధికంగా ఉండి మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. న్యూరోడీజనరేటివ్ జబ్బులైన అల్జీమర్స్ లాంటివి రాకుండా కాపాడుతుంది.

జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుంటేనే ప్రతిఒక్కరూ ఆరోగ్యకరంగా ఉండగలరు. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మల విసర్జన సాఫీగా జరిగి మలబద్దకం దరిచేరదు. స్కిన్ చాలా ప్రకాశవంతంగా మెరుగ్గా కనిపించడానికి సహజ పద్ధతిని వాడాలనుకుంటే అందుకు బాదంపప్పులు కరెక్ట్ ఆప్షన్. విటమిన్ ఈ అధికంగా ఉండి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండి చర్మంలోని కణాలు డ్యామేజీ కాకుండా కాపాడుతాయి.