calender_icon.png 20 April, 2025 | 1:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రయాణంలో ప్రతి విషయాన్ని గమనించండి

12-04-2025 05:25:38 PM

రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ ఫైనాన్స్ చైర్మన్ ఓబెదుల కొత్వాల్..

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): హజ్ కు ప్రయాణించే ప్రతి ఒక్కరు అన్ని విషయాలపై అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ ఫైనాన్స్ చైర్మన్ ఒబెదుల్ల కొత్వాల్ అన్నారు. శనివారం జిల్లా హజ్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని వైట్ హౌస్ లో హజ్-2025 మెగా డిజిటల్ ట్రైనింగ్ క్యాంప్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ హజ్ కమిటీ చైర్మన్ సయ్యద్ గులాం అఫ్జల్ బియా, తెలంగాణ హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సజ్జత్ అలీలతో కలిసి ఆయన హాజరై మాట్లాడారు. కమిటీ సూచిస్తున్న ప్రతి సూచనలను అమలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. హజ్ కమిటీ అందరికీ సముచిత స్థానంలో యాత్రను పూర్తి చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సొసైటీ మెంబర్స్, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.