calender_icon.png 25 April, 2025 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజన మ్యూజియం ఆవరణలోని స్టాల్స్ ను పరిశుభ్రంగా ఉంచండి

24-04-2025 08:02:27 PM

ఐటీడీఏ ఏపీవో డేవిడ్ రాజు...

భద్రాచలం (విజయక్రాంతి): ఐటిడిఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియం సందర్శనకు పర్యాటకులు వచ్చి మ్యూజియంలోని కళాఖండాలను తిలకించిన తర్వాత గిరిజన వంటకాలు తప్పనిసరిగా చవిచూస్తారని, తినుబండారాల స్టాల్స్ నిర్వాహకులు పరిశుభ్రతను పాటించలని ఐటిడిఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్(ITDA APO David Raju) సూచించారు. గురువారం  తన ఛాంబర్ లో ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఆదేశాల మేరకు మ్యూజియం ప్రాంగణంలో స్టాల్స్ ఏర్పాటు చేసిన నిర్వాహకులతో ఆయన తినుబండారాల తయారీ విషయంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మ్యూజియం సందర్శనకు పర్యాటకుల తాకిడి పెరుగుతున్నందున మ్యూజియంలో గిరిజన వంటకాలు, వివిధ రకాల తినుబండారాల స్టాల్స్ ఏర్పాటు చేసిన నిర్వహకులు స్టాల్స్ ముందు పరిశుభ్రత పాటించి, సందర్శకులు కుటుంబ సభ్యులతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ తినడానికి స్టాల్స్ ముందు కూర్చోవడానికి సౌకర్యాలు కల్పించాలన్నారు. తినుబండారాలు తయారు చేస్తున్న సిబ్బంది చేతులకు గ్లౌజులతో పాటు, తలకి రక్షణ కవచాలు తప్పనిసరిగా ధరించాలన్నారు. తినిబండారాలను ఎంఆర్పి రేట్లకే పర్యాటకులకు విక్రయించాలని, పర్యాటకులు కోరిన తినుబండారాలు అధిక ధరలకు అమ్ముతున్నట్లు మా దృష్టికి వస్తే ఆ స్టాల్స్ ను తొలగించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జేడీఎం హరికృష్ణ, గిరిజన స్టాల్స్ నిర్వాహకులు సుధారాణి, రాజేందర్, భూలక్ష్మి, దినేష్ తదితరులు పాల్గొన్నారు.