20-04-2025 12:57:34 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): శాసనసభ ఎన్నికలకు ముం దు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన వాగ్ధానం ప్రకారం తమ ను రెగ్యులరైజ్ చేసి, మాట నిలబెట్టుకోవాల ని తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీస్ కాం ట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ (టీజీయూసీటీఏ)జేఏసీ నాయకులు డా.పరశురామ్, డా. ధర్మతేజ, డా.వేల్పుల కుమార్, డా.విజయేందర్‌రెడ్డి కోరారు.
రాష్ట్ర ప్రభుత్వానికి తమపై పలువురు తప్పుడు నివేదికలు, తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని ఆరోపించారు. తమను రెగ్యులర్ చేయాలని కోరుతూ శుక్రవారం రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు నిరవధిక సమ్మెకు దిగారు.
ఉస్మానియా యూనివర్సి టీ, కాకతీయ యూనివర్సిటీ, జేఎన్టీయూహె చ్, జేఎన్టీయూ మంథని, తెలంగాణ యూ నివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, ట్రిపుల్ ఐటీ బాసర లలో ఆయా యూనివర్సిటీల్లోని పరిపాలన భవనాల ఎదుట, రోడ్లపై నిరసన, దీక్షలు చేపట్టారు.
ఈ సందర్భంగా టీజీయూసీటీఏ నాయకులు మాట్లాడుతూ.. కాంట్రాక్టు ఆధ్యాప కులను రెగ్యులరైజ్ చేయటానికి ఎటువంటి న్యాయపర మైనటువంటి చిక్కులు లేవని, సుప్రీంకోర్టు గతంలోనే తీర్పు ఇచ్చిందన్నారు. ప్రభుత్వానికి తాము వ్యతిరేకం కాద ని, తమ న్యాయమైన డిమాండ్‌లను నెరవేర్చాలని కోరారు.