calender_icon.png 20 November, 2024 | 6:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెరువులకు గండ్లు పడకుండా సూడాలె

21-07-2024 01:34:14 AM

అధికారులతో సమీక్షలో మంత్రి సీతక్క

హైదరాబాద్, జూలై 20 (విజయక్రాంతి): గోదావరి వరదలపై ప్రజలు, అధి కారులు అప్రమత్తంగా ఉండాలని గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సూచించారు. శనివారం మంత్రి సీతక్క  సచివాలయంలో వరద పరిస్థితిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేప థ్యంలో అధికారులంతా అలర్ట్‌గా ఉండాలన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ ఇంచార్జి మం త్రిగా ఉన్న ఆమె  జిల్లాల కలెక్టర్లు, ములుగు కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడుతూ గోదావరి వరద పరిస్థితి వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.

గత అనుభవాల దృష్ట్యా ఇప్పటికే ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. గోదావరి ముంపు ప్రాంతాల ప్రజల రక్షణ కోసం ముందస్తు చర్యల్లో భాగంగా ఏటూరు నాగారంలో కంట్రోల్  రూమ్ ఏర్పాటు చేశామని అధికారులు మంత్రికి తెలియజేశారు. వాజేడు, వెంకటాపురం, ఏటూరు  నాగారం, మంగపేట, కన్నాయిగూడెం, మండలాల్లో 135 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని.. ఎన్డీఆర్‌ఎఫ్ టీమ్‌లతో పాటు బోట్ల ను కూడా అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. కలెక్టర్‌తో పాటు జిల్లా ఉన్నతాధికారులు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.