26-04-2025 12:11:59 AM
పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి
మహబూబ్ నగర్ ఏప్రిల్ 25 (విజయ క్రాంతి) : ఉద్యమించడం తెలంగాణ పౌర సమాజానికి కొత్త కాదని, తరతరాలుగా ఆధిపత్యం పై ఉద్యమించి విజయాలను సాధించిన ఘనత, ఘన చరిత్ర ఈ ప్రాంతానికి ఉందని పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షులు ఎం. రాఘవాచారి అన్నారు. శుక్రవారం విశ్వవిద్యాలయాల కాంట్రాక్ట్ అధ్యాప కులు చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు ఆయ న మద్దతు తెలిపి మాట్లాడారు.
ఉద్యమాన్ని మరింత ఉత్సాహంతో కొనసాగించి తమ హక్కులు సాధించుకోవాలని, అందుకు పౌర సమాజమంత బాసటగా నిలవాలన్నా రు. ప్రభుత్వాలు విద్య పట్ల ప్రదర్శిస్తున్న సవతి తల్లి ప్రేమకు నిదర్శనమే నేడు కాంట్రాక్టు అధ్యాపకులు చేస్తున్న నిరవధిక సమ్మె అని, ఉన్నత విద్యావంతులైన యూనివర్సిటీ అధ్యాపకులు సమాజానికి, విద్యార్థు లకు దిశా నిర్దేశం చేస్తున్న అధ్యాపకులు టెం ట్ కింద కూర్చోవడం సభ్య సమాజానికి తలవంపు అని, ఎన్నికల ముందు తాము ప్రకటించిన వాగ్దానాలను నిలబెట్టుకొని వెంటనే కాంట్రాక్టు అధ్యాపకుల న్యాయమైన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టు అధ్యాపకులు ఉన్నారు.