ఎక్కడ ఖాళీలు ఉన్నాయో తెలియక ఇబ్బందులు
ఆప్షన్లు ఇచ్చే క్రమంలో గుర్తించిన వైనం
అనేక ఆఫీసుల్లో ఖాళీల స్థానాలను డిస్‌ప్లే చేయలేదని ఉద్యోగుల ఆవేదన
హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే డిప్యూటేషన్లపై ఎటూ తేల్చకుండానే ప్రభుత్వం బదిలీల ప్రక్రియను చేపట్టడంపై విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. గతంలో ఎప్పుడు బదిలీలు జరిగినా.. డిప్యుటేషన్లలో ఉన్నవారిని వారి సొంత స్థానాలకు పంపించిన తర్వాతే స్థాన చలనాలకు శ్రీకారం చుట్టే వారు. ఈసారి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఫలితంగా ఆప్షన్లు ఇచ్చే సమయంలో ఖాళీల విషయంలో గందరగోళం నెలకొన్నదని ఉద్యోగులు అంటు న్నారు.
డిప్యూటేషన్ల విషయంలో ప్రభుత్వం ఏమీ చెప్పకపోవడంతో కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు, అధికారులు దీనిని ఆసరాగా చేసుకొంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పలువురు అధికారులు, కొందరు ఉద్యోగ సంఘాల నాయకులకు ప్రయోజనం చేకూర్చేలా.. రాష్ట్రంలోని చాలా ఆఫీసుల్లో బదిలీల జాబితాను కూడా ప్రదర్శించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుం, డిప్యుటేషన్‌పై కొనసాగుతున్న కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు పనిచేస్తున్న స్థానాన్ని కూడా ఆప్షన్లలో చూపె ట్టలేదని ఉద్యోగులు అంటున్నారు. దీనివల్ల సదరు స్థానాలు ఖాళీగా ఉన్నాయా? లేక భర్తీ అయ్యాయా? తెలియక గందరగోళానికి గురవుతున్నట్లు చెబుతున్నారు. డిప్యుటేషన్లను కొనసాగిస్తూ.. బదిలీలను చేపట్టడం వల్ల ఖాళీగా ఉన్న స్థానాలపై స్పష్టత కొరవడిందని అంటున్నారు.
సొంత స్థానంలో అతనే.. డిప్యుటేషన్ స్థానంలోనూ అతనే..
రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపార్ట్‌మెంట్లలో కలిపి వేల మంది ఉద్యోగులు డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. ఒక్క కమర్షియల్ టాక్స్ డిపార్ట్ మెంట్‌లోనే 100కు పైగా ఉద్యోగు లు డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నట్లు తెలుస్తోం ది. నాలుగేళ్లు ఒకేచోట పనిచేసిన వారికి బది లీ తప్పదని ఆర్థిక శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, ఒక ఉద్యోగి డిప్యూటేషన్‌పై ఒక ఆఫీసుకు వచ్చి రెండేళ్లు పూర్తయ్యింది అనుకుం దాం. ఇదే ఉద్యోగి.. తన సొంత స్థానంలో ఉద్యోగం చేస్తున్నట్లు రికార్డుల్లో ఉంటుంది. మళ్లీ అతనే డిప్యుటేషన్‌పై మరోచోట చేస్తున్నట్లు కనిపిస్తుంది. దీనివల్ల ఆ రెండు చోట్ల ఏ స్థానంలో ఈ బదిలీ ప్రక్రియలో భర్తీ చేస్తారనే విషయం తెలియని పరిస్థితి నెలకొందనే అభిప్రాయం వెలువడుతోంది. దీని వల్ల డిప్యుటేషన్‌పై కొనసాగుతున్న వారికే ప్రయోజనం చేకూరుతుందని, నాలుగేళ్లు పూర్తి తమకు అన్యాయం జరుగుతోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యోగుల బదిలీ పక్రియలో భాగంగా ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు ఉద్యోగులకు ఆప్షన్లు ఇచ్చే అవకాశం కల్పించారు. డిప్యుటేషన్‌పై ఉన్న వారిని సొంత స్థానాల కు బదిలీ చేసి.. ట్రాన్స్‌ఫర్లు చేపట్టాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఇందుకోసం ఆప్షన్లు ఇచ్చే తేదీని పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు.