calender_icon.png 25 March, 2025 | 8:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

కేడీసీసీబీ సేవలు అభినందనీయం

24-03-2025 12:02:41 AM

తెలంగాణ రాష్ట్ర సహకారశాఖ కమిషనర్ కె సురేంద్ర మోహన్

కరీంనగర్, మార్చి 23 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (కేడీసీసీబీ) సేవలు అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర సహకారశాఖ కమిషనర్, రాష్ట్ర సహకార సంఘాల రిజిస్ట్రార్ కె సురేంద్ర మోహన్ తెలిపారు. ఆదివారం కేడీసీసీబీ, నుస్తులాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేడీసీసీబీ, సహకార సంఘాలు దేశంలోని సహకార రంగ బ్యాంకులకు, సంఘాలకు మార్గదర్శంగా ఉన్నాయన్నారు. ఇక్కడి విధానాలను రాష్ట్రమంతటా పాటించేలా చూడాలన్నారు.

రాష్ట్రంలోని కృషి విజ్ఞాన కేంద్రాలు, ఉద్యాన శాఖ, మార్కెంటింగ్ శాఖ, వివిధ సహకార రంగ సంస్థలను అనుసంధానం చేసి రైతుల ఉతపత్తులను సమీకరించి, వాటి విలువను పెంపొందించి, మంచి ధరకు అమ్మించి రైతులకు అధిక లాబాలు అందేలా పనిచేయించాలన్నారు.

కేడీసీసీ బ్యాంకులోని సంఘాలు నిర్వహిస్తున్న వివిధ సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీబీ సీఈవో సత్యనారాయణరావు, ఉమ్మడి జిల్లా సహకార అధికారులు ఎన్ రామానుజచార్యులు, శ్రీమాల, మనోజక్కుమార్, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.