23-03-2025 01:01:04 AM
పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్
హైదరాబాద్, మార్చి 22 (విజయక్రాంతి): తెలంగాణలో బీఆర్‌ఎస్ దుకాణం బంద్ అయిందని, బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి సీఎం అవుతానని కేసీఆర్ పగటి కలలుకంటున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఎద్దేవా చేశారు.
బీఆర్‌ఎస్ సృష్టించిన ఆర్థిక విధ్వంస పునాదుల మీద రైజింగ్ తెలంగాణ నినాదంతో రా పునర్నిర్మిస్తున్నామని శనివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. అమావాస్య చంద్రుడిలా ఫాంహౌస్ నుంచి బయటికొచ్చిన ప్రతిసారి ప్రగల్భాలు పల కేసీఆర్‌కు అలవాటైందన్నారు. బీఆర్‌ఎస్ సింగిల్‌గానే కాదు..బీజేపీతో జతకట్టి వచ్చినా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే మళ్లీ అధికారమని ధీమా వ్యక్తం చేశారు. కుటుం కోసం కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాలను తాకట్టుపెట్టారని మండిపడ్డారు.