calender_icon.png 31 October, 2024 | 12:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్‌వి పగటికలలు

04-07-2024 02:07:49 AM

ఇక తెలంగాణలో బీఆర్‌ఎస్ అనేదే ఉండదు

పీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం 

హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): వచ్చే 15 సంవత్సరాలు అధికారం బీఆర్‌ఎస్‌దే అంటూ కేసీఆర్ పగటి కలలు కంటున్నారని, ఏమి చేశారని ప్రజలు మళ్లీ అధికా రం ఇస్తారని  పీసీసీ అధికార ప్రతిని ధి సత్యం శ్రీరంగం అడిగారు. బుధవారం ఆయన పీసీసీ ప్రధాన కార్యదర్శి కైలాష్ నేతతో కలిసి మాట్లాడుతూ.. పదేళ్లు అధికారంలో ఉండి రూ. 7 లక్షల కోట్ల అప్పులు చేశారని.. అందుకు మరోసారి అధికారం కట్టబెట్టాలా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీలపై ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతూ, వ్యవస్థలను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీది ముగిసిన అధ్యాయమని, ఇక బీఆర్‌ఎస్ పేరు వినిపించేది కూడా అనుమేనన్నారు. విద్యుత్ కొనుగోళ్లలో చేసిన అరాచకాలకు కేసీఆర్ జైలుకు వెళ్లకతప్ప దని కైలాష్ నేత అన్నారు.